కురవిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ప్రత్యేక పూజలు..
ముద్ర ప్రతినిధి మహబూబాబాద్: కేంద్రప్రభుత్వం చే జాతీయ ఎస్టీ కమిషన్సభ్యునిగా నియామకం అయ్యి., ఇటీవలే పదవి బాధ్యతలు స్వీకరించిన జాటోత్ హుస్సేన్ నాయక్ కురవి లోని శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కురవి దేవాలయానికి వచ్చిన హుస్సేన్ నాయక్ కు స్థానిక బిజెపి నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొణతం పెంటయ్య, కురవి మండల పార్టీఅధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు, జిల్లానాయకులు భద్రసేనగౌడ్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవార్లకు హుస్సేన్ నాయక్ మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావన ప్రతిఒక్కరిలోనూ అభివృద్ధి చెందాలని, తద్వారా మంచి ఆలోచనలు వస్తాయని అవి సమాజహితానికి ఉపయోగపడతాయని అన్నారు. ప్రధానంగా యువత క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని హుస్సేన్ నాయక్ కోరారు. డోర్నకల్ నియోజకవర్గ, కురవి మండల బిజేపి నాయకులు హుస్సేన్ నాయక్ ను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ..కార్యక్రమంలో హుస్సేన్ నాయక్ వెంట పలువురు బిజెపి జిల్లా, మండల నాయకులు ఉన్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొణతం పెంటయ్య ఇంటికి వెళ్లి అక్కడ తనను కలవడానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పలుఅంశాలపై మాట్లాడారు.