ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు.

ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు.
  • మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు.
  • కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి.

ముద్ర, ముస్తాబాద్:-రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం సెంటిమెంట్ తో కరీంనగర్ ఎంపీగా గెలిచి గడచిన ఐదేళ్లలో మతం పేరుతో యువతను రెచ్చగొట్టడం తప్ప కరీంనగర్ నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రశ్నించారు.గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టెక్స్టైల్ పార్కులు, తెలంగాణ స్వరాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడి పెప్పర్ స్ప్రే దాడిని సైతం తట్టుకొని తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేసిన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే మీరు సంస్కారం ఏంటో తెలుస్తుందని మండి పడ్డారు.కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం మానేసి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు రాముడు అవతారమెత్తి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.వంకర భాషను మాట్లాడం మానుకొని పద్ధతిగా ప్రవర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి  నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు మాజీ జెడ్పిటిసి యాదగిరి గౌడ్,పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి ఎస్సీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు తలారి నర్సింలు, ప్రశాంత్ గూడెం కొండాపూర్ మద్దికుంట చీకోడు గ్రామశాఖ అధ్యక్షులు బాలయ్య రాజు,కొండయ్య,రమేష్ మండల ఉపాధ్యక్షుడు కొమరయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్,సీనియర్ నాయకులు రాంరెడ్డి,బాల్ రెడ్డి, అనిల్,బాలరాజు,నవీన్ గౌడ్, వంశీ గౌడ్,కరుణాకర్, శ్రీనివాస్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.