పోడు భూముల హక్కులకై సిపిఐ పోరాటం -సిపిఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

పోడు భూముల హక్కులకై సిపిఐ పోరాటం  -సిపిఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

రాష్ట్రంలో పోడు భూముల హక్కుల కొరకు సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని సిపిఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు గురువారంకోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో  సుమారు వందమంది దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న 100 ఎకరాల కొండం చెరువు అటవీ ప్రాంతంలోని పోడు భూములనుఅయన పరిశీలించరు చాడ  వెంకటరెడ్డి మాట్లాడుతూ   పేదలకు పోడు భూములు దక్కేవరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని పోరాటం ఆపేది లేదని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన  రాజ్యాంగం వల్ల పోడు హక్కు పత్రాలను పొందెటువంటి హక్కు పోడు రైతులకు ఉందని రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు సరిగా చేయడం లేదని అన్నారు పేద ప్రజలకు రాజ్యాంగం ఒక వరం లాంటిదని రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు ప్రజలకు జీవనోపాధి పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇండ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు చట్టాలకు లోబడి ప్రజల కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు

మతోన్మాద పార్టీ బిజెపి
బిజెపి పార్టీ అంటేనే నరహంతక నియంతృత్వ పార్టీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ దళితులపై దాడులు చేస్తూ మనువాథ సిద్ధాంతాలను అవలంబిస్తు మతకలహాలు సృష్టిస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటుందన్నారు అయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మండల కార్యదర్శి మల్యాల జాన్సన్ సిపిఐ జిల్లా నాయకులు జంగo అంజయ్య కడారి రాములు రైతులు దిలీప్ రాజ నరసయ్య సుమారు వందమందిమహిళా రైతులు  పాల్గొన్నారు.