జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైస్సార్

జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైస్సార్
  • మండల అధ్యక్షులు తూము జలపతి..
  • ఘనంగా జన్మదిన వేడుకలు..

ముద్ర, రుద్రoగి: జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత నేత రాజశేఖరరెడ్డి అని డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి అన్నారు. శనివారం రోజున వైస్సార్ 74 వ జయంతి వేడుకలనురాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రతి పేదవాడు బ్రతకాలనే ఆలోచనతో చక్కటి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ  ద్వారా నయం చేసుకునే పథకాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్రెడ్డి కి దక్కిందన్నారు.ప్రతి నిరుపేద విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాలని ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకునే విధంగా చేశాడని,రైతులకు ఉచిత విద్యుత్,108 అంబులెన్స్ సేవలు, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం,రైతు రుణ‌మాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త‌ వైఎస్ఆర్ గారికే ద‌క్కుతుంది.వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలే  నేడు ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి.ఆయన మరణం తీరనిలోటని అన్నారు.. రైతులకు రుణమాఫీ తీసుకోవచ్చి రైతులను ఆదుకున్న మహానేత అని కొనియాడారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూము జలపతి,గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, డిసిసి నాయకులు చెలుకల తిరుపతి గడ్డం శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్, పల్లి గంగాధర్,గండి నారాయణ,మాడిశెట్టి అభిలాష్,సూర యాదయ్య ,ఎర్రం గంగానర్సయ్య,ధ్యావల రవి ఇప్ప మహేష్,పూదరి మహిపల్, గంధం మనోజ్, ధ్యావల దిలీప్ తదితరులు పాల్గొన్నారు..