కాంగ్రెస్ లోకి కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ ?

కాంగ్రెస్ లోకి కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ ?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త కరీంనగర్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ సమీకరణాలపై కీలక చర్చలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జడ్పీ చైర్పర్సన్ మంత్రిని కలవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. కనుమల్ల విజయతోపాటు పలువురు జడ్పీటీసీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం తో రానున్న ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని కీలక నేతలు అంతర్మధనంలో పడుతున్నారు. జడ్పీ చైర్ పర్సన్ పార్టీ మారితే జిల్లా రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.