బిఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డి కే...

బిఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డి కే...

గ్రూప్ రాజకీయారాలకు తెరపడేనా..?
ముద్ర, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి ను ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటన చేశారు.  ఆది నుంచి హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై అనుమానాలకు  కుండ బద్దలు కొడుతూ... పాడి కౌశిక్ రెడ్డి గారు టికెట్ ఖరారు చేయటంతో హుజురాబాద్ నియోజకవర్గం లోని ఆయా మండలాల్లోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.  హుజరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ నుంచి  ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించగా...  మేడ్చల్ జిల్లా భూముల వ్యవహారంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్త రఫ్ చేయటంతో బిఆర్ఎస్ పార్టీ నుంచి  పాడి కౌశిక్ రెడ్డి   బరిలో నిలబడ్డారు.

 పాడి కౌశిక్ రెడ్డికి కలిసివచ్చిన బై ఎలక్షన్... 
  బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఈట రాజేందర్ రాజీనామా చేసి బై ఎలక్షన్ కు తెరతీయటంతో.. రాష్ట్రంలోనే ఖరీద ఎన్నిక హుజురాబాద్ నియోజకవర్గం లో జరిగింది. ఈ అవకాశాన్ని దారిగా మలుచుకున్న  పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని  వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరగా  ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రహ్మాండమైన అవకాశాన్ని కల్పిస్తూ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిని కేటాయిస్తూ  అవకాశం కల్పించడంతో హుజురాబాద్ నియోజకవర్గం లో పాడి  కౌశిక్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.  ఎమ్మెల్సీ వచ్చిన కొద్దిరోజుల్లోనే ర ప్రభుత్వ  విప్ ప్రభుత్వ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మరింత జోషిగా నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయడంతో బై ఎలక్షన్  పాడి కౌశిక్ రెడ్డికి కలిసి వచ్చింది.

 గ్రూప్ రాజకీయారాలకు తెరపడేనా..? 
 హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పక్కకు తప్పుకోవటంతో టిఆర్ఎస్ పార్టీ  టికెట్ కోసం ఆశావాహులు  క్యూ కట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికల గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా ఆయనే ఓడిపోవడంతో   తిరిగి ఈసారైనా తనకు టికెట్ వస్తుందని ధీమాతో ఉండటంతో టికెట్ రాకపోవడంతో ఆయనే అంతరంగంలో పడిపోయారు. దీనికి తోడు  హుజరాబాద్ నియోజకవర్గం లో సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి  సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. జమ్మికుంట నుంచి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నగంటి మల్లయ్య సైతం టికెట్  ఆశించారు. చివరకు పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయం తీసుకోవడంతో... ఈ గ్రూపు రాజకీయాల మూలంగా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంద లేదా తిరిగి ఓటమిపాలవు.తుందా అనేది చర్చ నడుస్తోంది.