మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి

మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

ముద్ర, ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై బిజెపి కార్పొరేటర్ లకు ఆహ్వాన సమాచారం ఇవ్వనందుకు మున్సిపల్ కమిషనర్  పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు బీజేపీ  కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ సమావేశ మందిర నిర్మాణం జరిగిందని, 21వ తేదీన జరిగిన సమావేశ మందిర ప్రారంభోత్సవానికి బిజెపి కార్పొరేటర్లను ఆహ్వానించకుండా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్నారు.

అధికార పార్టీ సభ్యులకు మాత్రమే ప్రోగ్రామ్ కు సంబంధించి ఆహ్వానం పలికి, సరైన సమాచారం తెలియజేయకుండా , కార్యక్రమాలకు ఆహ్వానం పలకకుండా బిజెపి కార్పొరేటర్ల పై మున్సిపల్ కమిషనర్ వివక్ష ఎందుకు చూపెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బిజెపి  బిజెపి కార్పొరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబల  శ్రీనివాస్, కార్పొరేటర్లు రాపర్తి విజయ, చొప్పరి జయశ్రీ,  కోలగని శ్రీనివాస్, కచ్చు రవి,  కాసర్ల ఆనంద్, పెద్దపెల్లి జితేందర్, బండ సుమ రమణారెడ్డి, నాగసముద్రం విజయలక్ష్మి , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.