పెద్దమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

పెద్దమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

చిగురుమామిడి ముద్ర న్యూస్:  చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తులు నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయాన్ని శనివారం ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెనుకుల తిరుపతి, ఎంపిటీసి మిట్టపల్లి మల్లేశం, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి నాయకులు సాంబారి కొమురయ్య, బెజ్జంకి రాంబాబు, శ్రీనివాస రెడ్డి పెద్దమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ మామిడి శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మామిడి సంపత్, డైరెక్టర్ మామిడి రాజయ్య, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.