ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

రామకృష్ణాపూర్,ముద్ర: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించడమే ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) ముఖ్య ఉద్దేశమని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో జిల్లా ట్రస్మా అధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని 4 వ తేదీన మందమర్రి రాజీవ్ నగర్ తవక్కల్ పాఠశాలలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, డీఈవో యాదయ్య,ఎంఈఓ పోచయ్య,ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్రపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ళ ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్ సూరం శ్రీనివాస్,నస్పూర్ కార్యదర్శి రామకృష్ణ, ట్రెజరర్ సత్యనారాయణ పాల్గొన్నారు.