ఎన్ హెచ్ ఎం స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..

ఎన్ హెచ్ ఎం స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..
  • ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్

భువనగిరి సెప్టెంబర్ 01 (ముద్ర న్యూస్):- నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి,నేటికీ దశబ్ద కాలం పూర్తవుతున్న నేటికీ ఆ హామీ నెరవేరాలేదన్నారు. రాష్ట్రంలో సుమారుగా 16,000 మంది ఉద్యోగులు గత 23 సంవత్సరాలు నుండి పనిచేస్తూ చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యం అందించడంలో వారి ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్టు ఎన్ హెచ్ ఎం  స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులందర్నీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హెల్త్ ఇన్సూరెన్స్ పదిలక్షలు కల్పించాలని,దురదుష్టవత్తు మరణించిన వారికి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని. ఈఎస్ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు& ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు కామ్రాన్, దుర్గ, వినోద్, మధు, శ్రీదేవి, శిరీష, రమేష్, శ్రీనివాస్, సరిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.