పల్లె ప్రకృతి వనానికి నిప్పు– కాలిపోయిన చెట్లు, విద్యుత్ వైర్లు

పల్లె ప్రకృతి వనానికి నిప్పు– కాలిపోయిన చెట్లు, విద్యుత్ వైర్లు

ముద్ర/ వీపనగండ్ల:-పల్లె ప్రకృతి వనంలో మంటలు చెలరేగి చెట్లు విద్యుత్ వైర్లు అగ్నికి ఆహుతి అయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కల్వరాల పల్లె ప్రకృతి వనంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రకృతి వనంలోని వివిధ రకాల చెట్లు, గ్రామ పంచాయతీకి సంబంధించిన విద్యుత్ బోరు మోటర్ వైరు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

పల్లె ప్రకృతి వనానికి సమీపంలో కాలువలో ఉన్న జమ్ము కు గుర్తుతెలియని కొందరు వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఆ మంటలు చెలరేగి సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి వ్యాపించటంతో ఒకసారి ఆ మంటలు చెలరేగి వనంలోని పూల, పండ్ల చెట్లు కొబ్బరి చెట్లు తో పాటు వివిధ రకాల చెట్లు కాలిపోగా, విద్యుత్ బోరు మోటర్ వైర్లు కూడా అందులో కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

పల్లె ప్రకృతి వనంలో ఒక్కసారిగా చెలరేగిన మండలం చూసిన గ్రామస్తులు అక్కడ చేరుకొని పంటలను ఆర్పే లోపే పూర్తిగా అంటుకపోయిందని తెలిపారు.పల్లె ప్రకృతి వనానికి సమీపంలో రైతు తన పొలం వద్ద జమ్ముకు నిప్పు పెట్టి నిర్లక్ష్యంగా వదిలివేయడంతో పల్లె ప్రకృతి వనం లోకి మంటలు వ్యాపించి చెట్లు కాలిపోయాయని పంచాయతీ కార్యదర్శి కురుమన్న తెలిపారు.