పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి, వనపర్తి: పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని జిల్లా  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది అధికారుల తో కలిసి పలు అంశాలను పరిశీలించారు. అనంతరం కడుకుంట్ల గ్రామంలో  నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేసి  రికార్డులని పరిశీలించి, లబ్దదారులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో కంటి వెలుగు అమలులో విజయవంతంగా నిర్వహిస్తున్నామని,  ఏ విధమైన అలసత్వం ప్రదర్శించకుండా నిర్దేశించిన లక్ష్యం చేరాలని సూచించారు. అనంతరం లబ్దిదారులతో మాట్లాడి కంటి అద్దాలను పంపిణీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద నిర్మించిన పనులను ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో లైబ్రరీని సందర్శించారు. అలాగే ఆయిల్ ఫామ్ నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ క్రింద నిర్వహిస్తున్న నర్సరీని  పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా ఉదయం, సాయంత్రం నీరు పట్టించాలని కలెక్టర్ ఆదేశించారు.