వీపనగండ్ల ఎంపీఓ దారుణ హత్య

వీపనగండ్ల ఎంపీఓ దారుణ హత్య

వనపర్తిలో బైకును అడ్డగించి కత్తులతో దాడి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పంచాయితీ అధికారి (ఎంపీఓ) దారుణ హత్యకు గురయ్యారు..బుధవారం వీపనగండ్ల కు వెళ్లి విధులు ముగించుకొని సాయంత్రం వనపర్తి కి తిరిగి వసుండగ వనపర్తి మర్రికుంట వద్ద బైక్ ను అడ్డగించి కత్తులతో దాడి చేశారు. హత్య చేసిన దుండగులు మృతుడి సోదరులు అని పోలీసులు తెలిపారు. హత్యకు భూ తగాదాలు కారణమని తెలుస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వనపర్తి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం...