నిరంజన్ రెడ్డి మరోసారి గెలిపించండి

నిరంజన్ రెడ్డి మరోసారి గెలిపించండి
  • మున్సిపల్ వైస్ చైర్మన్, బి ఆర్ ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి :  వనపర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నిరంజన్ రెడ్డి ని మరోసారి గెలిపించాలని కోరుతూ  మున్సిపల్ వైస్ చైర్మన్ వనపర్తి పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.  ఇంటింటికి తిరిగి మహిళలను కలిసి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా టిఆర్ఎస్  అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ వనపర్తి  చరిత్రలో ఎన్నడూ జరగనీ అభివృద్ధి ఈ ఐదు సంవత్సరంలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని,  వనపర్తి తెలంగాణలోని ఒక తలమానికంగా అభివృద్ధి చెందిందని ఇందులో భాగంగా 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్డు విస్తరణ,  దశాబ్దాల కళ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల,  వ్యవసాయ రెసిడెన్షియల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తో పాటు ఫిషరీస్ సైన్స్ కళాశాల, గురుకుల పాఠశాలలు అదేవిధంగా వైద్య రంగంలో 600 పడకల ఆసుపత్రి, క్రిటికల్ కేర్ యూనిట్ మరియు మాత శిశు సంరక్షణ కేంద్రం కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తలదిన్నె విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు కొనసాగడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి నిరంజన్ రెడ్డి కృషి ఎనలేనిదని,  వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతుబంధు,  రైతు బీమా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి అన్నపూర్ణగా నిలిపిన ఘనత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మన అభ్యర్థి నిరంజన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు.  

ముఖ్యమంత్రి కేసీఆర్  దూరదృష్టితో అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు మధ్య, పేద తరగతి కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా ఉన్నాయన్నారు.  ఇందులో 400 రూపాయలకు సిలిండర్,  మహిళలకు నెలకు 3000 రూపాయలు ఆరోగ్య భీమా,  కేసీఆర్ బీమా రైతు బంధు పెంపుదల అసర పెన్షన్స్ పెంపు దీంతో పాటు మత్సకారులకు, గొర్ల కాపరులకు చేయూత ఇచ్చే అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి మన భవిష్యత్తును వనపర్తి నియోజకవర్గ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని,  ఇది కేవలం టిఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.