కెసిఆర్ పథకాలు దేశానికి ఆదర్శం

కెసిఆర్ పథకాలు దేశానికి ఆదర్శం
  • నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని నరసాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కొల్చారం మండలం ఎనగండ్ల, మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్ చిన్నగనపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ...చావు నోట్లోకి పోయి తెలంగాణ సాధించిన మహనీయుడు కెసిఆర్ అన్నారు.  మూడోసారి సీఎం  పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.  నర్సాపూర్ గడ్డపై  గులాబీ జెండా ఎగురుతుందన్నారు. మహిళల నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా మేనమామ మాదిరిగా లక్ష రూపాయలు షాది ముబారక్, కల్యాణ లక్ష్మి  అందజేస్తూ ఆదుకుంటున్నారు.

పురిటి నొప్పులతో బాధపడే గర్భిణీ స్త్రీ ఇంటి నుండి ఆసుపత్రికి, కాన్పు తర్వాత ఆసుపత్రి నుండి ఇంటిదాకా సురక్షితంగా చేర్చుతున్న ఆరోగ్య ప్రదాత అన్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపిపి మంజుల కాశీనాథ్, జెడ్పిటిసి  ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేష్ కుమార్, మాజీ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మండల ఎంపిటిసిలో ఫోరమ్ అధ్యక్షులు వేమారెడ్డి, శ్రీశైలం సంతోష, ఇందిరా ప్రియదర్శిని, నాయకులు  నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు బిఆర్ఎస్ లో చేరారు.