గరుడ గంగా పుష్కరాల గోడపత్రిక ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గరుడ గంగా పుష్కరాల గోడపత్రిక ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గరుడ గంగా మంజీరా పుష్కరాల గోడ పత్రికను  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈనెల 22వ తేదీ నుండి 12 రోజులపాటు పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నారు. 12 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్వహించిన పుష్కరాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కే. చంద్రశేఖర రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. మహిమాన్వితమైన గరుడ గంగా పుష్కరాల్లో  భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పునీతులు కావాలని  శ్రీ సరస్వతి ఆలయ నిర్మాత దోర్బల రాజమౌళి శర్మ పిలుపునిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని, పుణ్యస్నానాలు ఆచరించి చదువుల తల్లి సరస్వతి మాత, నాగదేవతను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుణాకర శర్మ, మహేష్ శర్మ తదితరులున్నారు.