అయ్యప్పల అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి

అయ్యప్పల అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి
  • 41 రోజుల అన్నదాత

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప మాల ధారణ స్వాములకు మండల కాలం (41 రోజులు) పాటు నిత్య అన్నదాన, అల్పాహారం కార్యక్రమం నిర్వహిస్తున్న దాత ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి  సోమవారం  అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు భోజనం వడ్డీంచారు. ఆలయ కమిటీ నాయకులు నిర్వాహకులు ఎమ్మెల్సీని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు సర్పంచులు దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి, యామిరెడ్డి, నాయకులు సాయాగౌడ్, శ్రీను నాయక్, సిద్దిరెడ్డి, పురం వెంకట నారాయణ, కొండా శ్రీను తదితరులున్నారు.

కాళికదేవి ఆలయంలో...

మెదక్ కాళికాదేవి ఆలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ పార్వతుల కల్యానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధికి తన వంతుగా 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించారు.