హైదరాబాద్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!

హైదరాబాద్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ బాలేశ్వర్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ 10వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఓల్డ్ సిటీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్‌ఖానా పోలీసు పికెట్ వద్ద ఈ తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు గన్ మిస్‌ఫైర్ అయిందా? లేదంటే ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.