నాగనూల్ గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించిన  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ...

నాగనూల్ గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించిన  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా  నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూల్ గ్రామంలో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ,పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకనీ శ్రీనివాస్ యాదవ్..

ఎమ్మెల్యే  మాట్లాడుతూ..

గొల్లకుర్ములలను ఆర్థికంగా, సామాజికంగా  ముందుకు తీసుకువెల్లడమే ప్రభుత్వ లక్ష్యం మని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ గ్రామంలో అయిన ప్రతి దానికి గోస వుండేది, అనేక ఇబ్బందులు వుండేవి,పశువులకు మేత లేక పశువులను అమ్ముకున్నం,కానీ ఈయల్ల తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత ఒక్కొకటగా ఒక్కొక్కటిగా ప్రజల కష్టాలను తీర్చుకుంటు వస్తున్నాం,గతంలో పడి పంట అన్నారు,పడి లేదు పంట లేదు,ఎద్దుల కడే లేదు,కానీ ఇయల్ల  ప్రతి గ్రామంలో పడి పంటలు అద్భుతంగా అభివృద్ధి చెందినాయి,గతంలో నాగనూల్ చెరువు నిండలంటే కప్పలను పెళ్లి చేసేవారు,కానీ ఇయల్ల KLI ద్వారా చెరువు నిండి నిరంతరం అలుగు పారుతుంది, అంటే అది సీఎం కేసీఆర్  కృషి అని తెలిపారు, ఒకప్పుడు రైతుల కన్ను మోగులు దిక్కు వుండే నేడు KLI కాలువల దిక్కు చూస్తున్నారు,రైతుకు వ్యవసాయం చేయడానికి సాగు నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, యంత్ర పరికరాలు ఇచ్చి,రైతు చనిపోతే రైతూ భీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు,యాదవులకు గోర్లు, ముదిరాజ్ లకు,చేపలు,రజకులు,ఉచిత కరెంట్,ప్రతి కులానికి ఏదో విధంగా లబ్ది చేయాలనీ సీఎం కేసీఆర్  కుల వృతులను ప్రోత్సహిస్తున్నారు, గొల్లకుర్మలు కోరిన గొర్రెలను కొనుగోలు చేసుకునేల అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.

పంపిణి చేసిన గొర్రెలకు ఇన్య్సూరెన్స్, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందనని, ఏ కారణంచేత గాని పంపిణి చేసిన గొర్రెలు చనిపోయినట్లయితె వాటిస్థానంలో మరో గొర్రెను అందించడం జరుగుతుందని అన్నారు,100 సంచార పశువైద్యశాలలు (1962) అంబులెన్స్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు,కులవృత్తులపై ఆదారపడి జీవించే వారిని ఆదుకోవడం జరుగుతుందని, గొల్ల, కుర్మ కులస్థుల ఆర్థికంగా ఎదగడానికి కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి గ్రామంలోని గొల్లకుర్మలు వృతిని కొనసాగిస్తున్న వారికి ఆదుకోవడం వలన ఆర్థికంగా ఎదుగుతారని ఈ పథకం చేపట్టము అని అన్నారు.

మాంసం కొరతను తిర్చడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న గొల్ల కుర్మ కుటుంబాలను ఆర్థిక ఎదుగల కొరకు  గొర్రెలను ఇవ్వడంతో పాటు  ఇన్యూరెన్స్, దాణా వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అని అన్నారు,వ్యాదుల వచ్చినట్లయితె వైద్య సదుపాయాలను కూడా అందించడం జరిగిందని అన్నారు. గోర్రెల పంపిణి కార్యక్రమం ద్వారా,రాష్టంలోనే మొట్టమొదటి సారిగా కృలవృత్తులను బలోపేతం చేయడం ద్వారా అన్ని వర్గాలు అభివృద్ది చెందుతుందనె, గొల్ల, కుర్మ కులస్థుల సంక్షేమం కొరకు ప్రోత్సహన్ని అందించి ఆదుకోవడం జరగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు,అదికారులు పాల్గొన్నారు..