అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం.          

అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం.          
  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.                            
  • ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి.                                        

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: రోగులకు వైద్య సేవలు అందిస్తూ సత్వరమే ఆరోగ్యం కల్పించే విధంగా సేవలు అందించవలసిన వైద్యులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హెచ్చరించారు ఆస్పత్రి ఆవరణలో చెత్తాచెదారంతో పాటు అపరిశుభ్రంగా ఉండడంతో ఆయన సానిటేషన్ విభాగం పై చర్యలు తీసుకోవాలని సూచించారు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పరిశీలించగా అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించడం సానిటేషన్ విభాగం సరిగా విధులు నిర్వహించకపోవడం ఆయన దృష్టికి రావడంతో ఆసుపత్రి సూపర్డెంట్ తో వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సకాలంలో విధులకు రావాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూత్రశాలలో, మరుగుదొడ్లు తాళాలు ఉండటం గమనించిన ఆయన సంబంధిత అధికారులను నిలదీయగా గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రి ఆవరణలో డ్రైనేజ్ పైప్ లైన్ వేయకుండా 90 లక్షల నిధులతో సిసి రోడ్డు హడావిడిగా రాత్రిపూట వెయ్యడం జరిగిందని ఆ సమయంలో పైప్ లైన్లు సరిగా వేయకపోవడం వల్ల మూత్రశాలలు, డ్రైనేజీ వ్యవస్థ నీరు వెళ్లడం లేదని అందుకే తాళాలు వేయడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకురావడంతో సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ తో చర్చిస్తానని ఆసుపత్రిలో మూత్రశాలలు పనిచేయకపోవడం పై మండిపడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న సానిటేషన్ విభాగం వారు మాజీ ఎమ్మెల్యే హయాంలో నియమితులు కావడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా విధులకు సరిగా హాజరు కావడం లేదని కొందరు ఆయన దృష్టికి తీసుకురావడంతో ఇలాంటి రాజకీయాలను సహించేది లేదని హెచ్చరించారు.