సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం...

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం...
  •  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ వారు కార్మికులకు వెంటనే పిఆర్సి అమలు చేయాలని కనీస వేతన 26,000 అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదీల రామయ్య సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య  మాట్లాడుతూ దాదాపు తొమ్మిది మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అని రంగాల కార్మికులకు పిఆర్సి వర్తింపజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం పిఆర్సి అమలు చేయకపోవడం కార్మికుల యొక్క కష్టాన్ని కాలరాయడమేనని వారు అన్నారు అందులో భాగంగా కేవలం 1000 రూపాయల వేతనం పెంచి చేతులు దులుపుకోవడం కాదని 30% పిఆర్సి అమలు చేసి కనీస వేతన 26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీలో ఒకే వేతనం అమలు చేయకుండా రకరకాల వేతనాలు 8500 ఇవ్వాల్సిన చోట 4000 3000 వేతనాలు ఇస్తూ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్నారని వారు అన్నారు. మరొకవైపు మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు ఏ పని చేయాలో తెలియక గందరగోళంలో  ఉన్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు 30% పిఆర్సి అమలు చేసి కనీస వేతనం 26,000 చెల్లించాలని లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని  రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ రాము కురుమయ్య కాసిం ఈ సూప్ శాంతయ్య కృష్ణ వెంకటరెడ్డి రాము నాగయ్య తిరుపతయ్య ఎల్లయ్య కురుమయ్య  కృష్ణయ్య వెంకటయ్య అలివేలమ్మ దేవేంద్రమ్మ వెంకటమ్మ రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.