3 కోట్ల కుంభకోణం
- ఆర్ఐ రిమాండ్
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ పౌర సరఫరాల గోదాంలో 3 కోట్ల అక్రమాల కేసులో ఆర్.ఐ చింతల నగేష్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. నాలుగు సెక్షన్లు ఐపీసీ 257, 406, 409, 420 క్రింద కేసు నమోదు చేసి రెండవ సారి రిమాండ్ కు పోలీసులు తరలించారు. సంవత్సరం క్రితం తూప్రాన్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్.ఐ గా పని చేసినప్పుడు 12 గుంటల భూమి విషయంలో రైతు బ్రతికుండగానే చనిపోయాడని తప్పుడు ధ్రువీకరణ చేసి వేరే వ్యక్తికి భూమిని రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో జైలుకు వెళ్లాడు. 2019 నుండి 2024 వరకు పౌర సరఫరాల గోదాంలో సుమారు 3 కోట్ల వరకు అక్రమంగా పిడిఎస్ రైస్, చక్కెర, గోన సంచులు అక్రమాలు చేసినట్లు సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ హరిక్రిష్ణ ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.