బిఆర్ఎస్ కు హవెలి ఘనపూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గుడ్ బై

బిఆర్ఎస్ కు హవెలి ఘనపూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గుడ్ బై

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, నాగపూర్ సర్పంచ్ ఒంటరి రాజేందర్ రెడ్డి బిఆర్ఎస్ కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో నాగపూర్ గ్రామాన్ని విస్మరిస్తున్నందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు.