మెదక్ పట్టణంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం- హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు

మెదక్ పట్టణంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం- హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో  శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోదండరామాలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలు, కల్యాణోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.   అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కొళ్ల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, కౌన్సిలర్ జయశ్రీ దుర్గాప్రసాద్, గడ్డమీది యశోద కృష్ణాగౌడ్, మామిళ్ళ ఆంజనేయులు, ఆర్కే శ్రీనివాస్, కొండల్ రెడ్డి, అశోక్, పట్టంలోని వేలాది మంది భక్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

'

కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు..
శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రం మెదక్ లోని శ్రీ కోదండ రామాలయంలో కలెక్టర్ రాజర్షి షా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీభాష్యం మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. శ్రీరాముడి గుణగణాలు అందరికి ఆదర్శనీయమన్నారు