హైకోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు

హైకోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు

అమరావతి, ముద్ర వార్తలు: ప్రాణహానివున్న తనకు 4 + 4 భద్రతను తొలగించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని వున్నందున భద్రతను గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఆయన పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై  తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ సమయంలో తమకు పూర్తి వివరాలు అందివ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. గతంలో మంత్రి హోదాలోవున్న అంబటి రాంబాబు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అప్పటికి మంత్రికి కొనసాగుతున్న 4 + 4 భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం తమ పట్ల కొనసాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఆయన ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు కోసం వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.