కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ...
ముద్ర,తెలంగాణ:- పార్టీ నుంచి నేతల ఫిరాయింపులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకాయి. తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. వెంకటేష్ నేత పార్టీలో చేరితే గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది.