రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడు..

రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడు..
  • బిఆర్ఎస్ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయింది
  • పెద్దపల్లి పార్లమెంట్  పరిధిలోగల ప్రాంతాల అభివృద్ధికి కృషి  చేస్తా - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి          

వెల్గటూర్, ముద్ర :  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో " బిజెపి"కి సంపూర్ణమైన మద్దతు (400 సీట్లు ) లభిస్తే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు అన్నింటిని రద్దు చేసేందుకు కోసం నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడని   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి గ్రామంలో  జరిగిన "తెలంగాణ  జన జాతర" సభకు హాజరై మాట్లాడారు. బిఆర్ఎస్  పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలం అయ్యిందని, ఆ పార్టీకి  ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు.

గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని, అది చచ్చిన పాము వంటిదని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఈ ప్రాంతాలకు గొప్ప చరిత్ర ఉందని ఆన్నారు. భారతదేశానికి ప్రధానమంత్రి గా బాధ్యతలను నిర్వహించిన పీవీ నరసింహారావుతో పాటుగా,  శ్రీపాదరావు(మాజీ స్పీకర్ ), వెంకటస్వామి(కాకా)లు ఇక్కడి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారేనని గుర్తు చేశారు.

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వరపై లక్ష్మణ్ కుమార్ గెలిచిన, అప్పుడున్న కలెక్టర్ కాళ్లు పట్టుకొని కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించు కున్నాడని ఎధేవ చేశారు.  కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో   ఇండ్లు, భూములను కోల్పోయిన  నిర్వాసితులను ఆదుకునే విషయంలో పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

కాగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలో గల కొన్ని సమస్యలను  పరిష్కరించాలని  ముఖ్యమంత్రిని కోరగా వాటికి సానుకూలంగా స్పందించారు. ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామ వద్ద రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని, వెల్గటూర్ మండలంలోని జగదేవ్పేటలో గల జంగల్నాల రిజర్వాయర్ను ఆధునికరించాలని, రామగుండంలో మరొక" పవర్ ప్లాంట్ను "ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరాడు.

కాగా గడ్డం వంశీని పెద్దపల్లినుంచి రెండు లక్షల మెజారిటీతో గెలిపించి తీసుకువస్తే మీరు అడిగినవన్నీ  చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, రాజారాంపల్లి సర్పంచ్ గెల్లి శేఖర్  తదితరులు పాల్గొన్నారు.