వయో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు హక్కు

వయో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు హక్కు
  • జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  ఇంటి నుండి బయటికి రాలేని పరిస్తితులలో ఉన్నటువంటి వయస్సు మళ్లీన వృద్దులు, అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకోవడం జిల్లాలో జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా తెలిపారు.  లోకసభ ఎన్నికల దృష్ట్యా 85 ఏళ్లకు పై బడిన వృద్దులు, 40 కన్నా ఎక్కువ అంగ వైకల్యం కలిగి ఉంది ఇంటి నుండి బయటికి రాలేని వారికి ఇంటి నుండి ఓటుహక్కు వినియోగించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 36  టీములను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం నుంచి  రెండు రోజులపాటు హోం ఓటింగ్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని ధర్మపురి నియోజక వర్గం లలో 849 మంది ఉన్నారని, ఇందులో కోరుట్ల నియోజక వర్గంలో 216, జగిత్యాల నియోజక వర్గంలో 374, ధర్మపురి నియోజక వర్గం లో 259 మంది ఓటర్లు హోం ఓటింగ్ వినియోగించు కోనున్నారు అని తెలిపారు. మొదటి రోజున జిల్లా వ్యాప్తంగా 320 హోం ఓటింగ్ లో పాల్గొని ఓటుహక్కు వినియోగించు కున్నట్లు కలెక్టర్ తెలిపారు.