రైతుల సమస్యలు పరిష్కరించకుండా సంబురాల..

రైతుల సమస్యలు పరిష్కరించకుండా సంబురాల..
  • రు.1,000 కోట్ల ప్రకటనల నిధులను స్థానిక సంస్థలకు బకాయిలు చెల్లిస్తే ఉపశమనం లభించేది
  • రైతులు ప్రశ్నిస్తారనే భయంతో బైండోవర్.. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రైతుల సమస్యలు పరిష్కారం పరిష్కరించకపోవడంతో, సంబురాల్లో రైతులు ప్రశ్నిస్తారనే భయం తో బైండోవర్ చేయడం దారుణమని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న ధాన్యం సేకరణ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడుస్తున్న ధాన్యం సేకరణలోని సమస్యలను  అధిగమించేందుకు, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా ప్రశ్నించారు. నేటికీ అదనపుతూకం, రవాణా సమస్య, అన్లోడింగ్ సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించి, మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత తొమ్మిదేళ్లుగా ధాన్యం సేకరిస్తున్నా అనుభవం పాఠాలు నేర్పడం లేదా అని ప్రశ్నించారు.

రైతుల సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించకుండా సంబురాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయనంత కాలం బీ ఆర్ ఎస్ నాయకులకు రైతాంగాన్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పరిపాలన సౌలభ్యం పేరిట పది జిల్లాలను 33వ జిల్లాలుగా మార్చారని, ఖాళీలను మాత్రం పది జిల్లాల అధికారులతోనే సర్దుబాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు రు.1,000 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఈ నిధులను సద్వినియోగం చేసి స్థానిక సంస్థలకు బకాయిలు చెల్లిస్తే ఉపశమనం లభించేదని అన్నారు. భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణ కోసం చెల్లిస్తున్న హమాలీ ఛార్జిలు రు.5 ప్రభుత్వం తన్ ఖజానాలో వేసుకుంటున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో  బ్లాక్ కాంగ్రెస్ గోపి రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, పట్టణ అధ్యక్షుడు మ్యకల రమేష్, జనరల్ సెక్రెటరీ మహేందర్ గౌడ్, ఆదిరెడ్డి, మండ రమేష్, కొయ్యడ మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, గంగారెడ్డి, గంగాధర్ మున్ను, సుధీర్, భూమయ్య నాగరాజు ఆరే శ్రీనివాస్, జిల్లా మత్స్యకార శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ పాల్గొన్నారు.