మల్యాలలో ఘనంగా రైతు దినోత్సవo

మల్యాలలో ఘనంగా రైతు దినోత్సవo

హాజరైన కలెక్టర్ యాష్మిన్ భాషా 
ముద్ర, మల్యాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలు (2014-23) లో భాగంగా శనివారం మల్యాల మండలంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మల్యాల, నూకపల్లి, తాటిపల్లి, మానాల రైతు వేదికల పరిధిలో ఇంచార్జీలు కొండపల్కల రామ్మోహన్ రావు, బోయిన్ పల్లి మధుసూదన్ రావు, మిట్టపల్లి సుదర్శన్, ఎండీ సుభాన్, ముత్యాల రాంలింగారెడ్డి, జనగాం శ్రీనివాస్, అయిల్నేని సాగర్ రావు, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. మల్యాల రైతు వేదికలో జరిగిన సమావేశానికి జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషా  హాజరయ్యారు. కాగా, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో  సమావేశాలకు తరలిరావడం జాతరను తలపించింది.

ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలతోపాటు, వ్యవసాయ పద్ధతులు, మెలకువలు, ప్రత్యామ్నాయ పంటలను సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్లుప్తంగా వివరించారు. అలాగే రైతులతో మాట్లాడించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని నివృత్తి చేశారు. అలాగే ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ వెంకటేష్, అగ్రికల్చర్ ఏవో చంద్రదీపక్, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, జడ్పి కో ఆప్సన్ సభ్యుడు ఎండీ సుభాన్, సింగిల్ విండో అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, ఆయిల్నేని సాగర్ రావు, బోయిన్ పల్లి మధుసూదన్ రావు, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, గంగాధర్, మండల కో ఆప్సన్ సభ్యుడు అజార్, ఎంపీటీసీలు రమేష్, భూపతిరెడ్డి, సామా భాస్కర్ రెడ్డి, సంత ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 ఆయిల్ ఫామ్, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి... కలెక్టర్

రైతులు ఆయిల్ ఫామ్, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషా పేర్కొన్నారు. మల్యాల రైతు వేదికలో మాట్లాడుతూ... ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం 100% సబ్సిడీ అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే మన పాత తరం వాళ్ళల వరిసాగుతో పాటు  కూరగాయలు, డైరీ, కోళ్ల ఫామ్  వైపు కూడా దృష్టి సారిస్తే బాగుంటదన్నారు. మరోసారి అకాలవర్షాలు, వడగoడ్ల భారి నుంచి తప్పించుకోవడానికి అధికారులతో సంప్రదిస్తూ ముందస్తు ప్రణాళికలు, కొత్త పద్ధతులను తీసుకోవాలన్నారు.  ఇది ఇలా ఉండగా, నూకపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు, ఉద్యమకారుడు మధుసూదన్ రావు ప్రసంగానికి రైతులు ఫిదా అయ్యారు. తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవసాయ అభివృద్ధికి ఎక్కడలేని విధంగా ప్రాధాన్యం వచ్చారని అన్నారు. కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు, కరెంటు కోత లేకుండా చేశారని ఏకధాటిగా గంటకు పైగా మాట్లాడారు. ముత్యoపేట సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో, ట్రాక్టర్ల తో ర్యాలీ నిర్వహించారు.