కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం - బీసీ రుణ దరఖాస్తుదారులకు శాపం

కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం - బీసీ రుణ దరఖాస్తుదారులకు శాపం

ముద్ర రాయికల్ : రాయికల్ మండల తహాసిల్దార్ కార్యాలయానికి బి.సి సబ్సిడీ ఋణాల ధరఖాస్తు కోసం జనాలు క్యూ కట్టారు ఒకేసారి వందల సంఖ్యలో ఆదాయ,కుల  దృవీకరణ పత్రాలు కోసం దరఖాస్తులు రావడంతో అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. ఆదాయ ధ్రువీకరణ  పత్రాల జారీ ప్రక్రియ అధికారం డిప్యూటీ తాహాసిల్దార్ అనిల్ కు ఉండడంతో ఆయన ఆదాయ ధృవీకరణ పత్రాలను ప్రజాల అవసరాల రీత్యా వెంటనే జారీ చేస్తున్నారు.

కానీ కుల ధ్రువీకరణాల పత్రాల జారీ అధికారం కేవలం తాహాసిల్దార్ కే ఉండగా ఇంచార్జి తాహాసిల్దార్ గా ఉన్న  నవీన్ కార్యాలయానికి రాకపోవడంతో క్యాస్ట్ సర్టిఫికెట్ జారీలో తీవ్రమైన జాప్యం  జరుగుతుంది, దానితో
బీ.సీ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు సమయం ఇంకా మూడు రోజులు ఉండడంతో దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హులైన బహుజనులు ఆందోళన చెందుతున్నారు, ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.