యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లను ప్రజలకు వివరించాలి.

యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లను ప్రజలకు వివరించాలి.

మెట్‌పల్లి ముద్ర :- వరంగల్ లో రాహుల్ గాంధీ సభలో చేసిన రైతు డిక్లరేషన్, హైదరాబాద్ ప్రియాంక గాంధీ సభలో చేసిన యూత్ డిక్లరేషన్ ను నియోజకవర్గంలో గడప గడపకు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సామ్రాట్ లు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమిరెడ్డీ కరమ్ చంద్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూత్ డిక్లరేషన్ పోస్టర్ ఆవిష్కరించారు . కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి వివరించాలని. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పెంట ప్రణయ్, యూత్ కాంగ్రెస్ ఆర్టిఐ జగిత్యాల జిల్లా చైర్మన్ కాజా అజీముద్దీన్ , ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్,పట్టణ అధ్యక్షుడు కడకుంట్ల గంగాధర్, పార్లమెంట్ జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ రజాక్, ఇబ్రహీంపట్నం మండల్ ప్రెసిడెంట్ కోటగిరి సిద్ధార్థ, పట్టణ ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ బర్ల వంశీ, బర్ల అర్జున్,ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బిరుకుల విజయ పటేల్, పట్టణ అధ్యక్షుడు పోల్కం శివ, యూత్ కాంగ్రెస్ నాయకులు చరణ్, సాయికుమార్, రోహిత్ ,అభిషేక్ అజయ్, విగ్నేష్, శ్రీనాథ్, సమీర్ ఆసిఫ్, రెహమాన్, అప్సర్ ,నితిన్ నాగేష్, వర్ధన్ ,సన్నీ, అప్సర్, సాదిక్ లు పాల్గొన్నారు.