సెల్ఫీ వీడియోతో మెట్‌పల్లి వ్యక్తి ఆత్మహత్య..

సెల్ఫీ వీడియోతో మెట్‌పల్లి వ్యక్తి ఆత్మహత్య..
  • హైదరాబాద్ లో ఘటన..
  • కథలాపూర్ లో బైక్ షోరూం పాట్నార్ మోసం చేశాడని ఆరోపణ..

మెట్‌పల్లి ముద్ర:- మెట్‌పల్లి పట్టణం చైతన్య నగర్ కు చెందిన సబ్బాని నరేష్ హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం మెట్‌పల్లితో పాటు కథలాపూర్ లో కలకలం రేపుతోంది. నరేష్ కథలపూర్ లో హీరో షో రూమ్ నిర్వహిస్తాడు. మెట్‌పల్లి పట్టణం మార్కెట్ రోడ్ కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి తన షోరూంలో గత కొంతకాలంగా నమ్మకస్తుడిగా పని చేస్తున్నాడు. ప్రతాప్ తనకు వచ్చిన ఆలోచనతో భవాని ఎంటర్ ప్రైజేస్ పేరుతో బైక్ స్కీమ్ ప్రారంభిద్దాం అని నరేష్ తో చెబుతాడు.నరేష్ ఒప్పుకోవడం తో స్కీమ్ ప్రారంభించి నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నరేష్ బైక్ లు స్కీమ్ లబ్ధిదారులకు ఇస్తాడు. మరి కొంత మంది వద్ద స్కీమ్ లు కట్టించుకున్న ప్రతాప్ తనకు సపరేట్ గా బ్యాంక్ ఖాతా తెరిపించుకొని స్కీమ్ డబ్బులు అతని ఖాతాలో జమ చేయించుకుంటాడు.ప్రతాప్ స్కీమ్ పేరుతో కోటి 90 లక్షల రూపాయలు తీసుకొని స్కీమ్ లు కట్టిన వారితో పాటు తనను కూడా మోసం చేశాడని నరేష్ సేల్ఫి వీడియోలో తన బాదంతా చెప్పుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   నరేష్ వద్ద వర్కర్ గా ఉన్న ప్రతాప్ స్కీమ్ పేరుతో డబ్బులు వాసులు చేసి తన అవసరాలు తీర్చుకున్నాడని డబ్బుల కోసం నరేష్ ను ఇబ్బందులకు గురి చేశాడని ప్రతాప్ కారణంగానే  నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు. 

నరేష్ సెల్ఫీ వీడియో సారాంశం..

నేను ప్రతాప్ అనే వ్యక్తిని కలుపుకొని బైక్ షోరూమ్ లో బైక్స్ స్కీమ్ లు చేసాము ఆరు స్కీమ్ లు చేయగా అందులో. రెండు స్కీమ్ లు క్లియర్ అయిపోయాయి. తర్వాత ప్రతాప్ కు పూర్తి ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చాను. ఆ తర్వాత అతడి పేరుపై బ్యాంకు ఖాతా కూడా తెరిచాను. నా పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతా ను వద్దని ఎప్పుడు మనమిద్దరం ఒకే దగ్గర ఉండము.ఏదైనా డబ్బులు వస్తె నేను చెక్ చేసుకువచ్చు. నిన్ను ఎప్పుడు లెక్కలు అడిగే అవసరం ఉండదు అని చెప్పి అతడి పేరుపై తీయించుకున్నాడు. నేను కూడా దీనికి అంగీకరించి..కోరుట్ల హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ప్రతాప్ పేరుపై కరెంట్ ఖాతా ఓపెన్ చేయించా.మిగతా నాలుగు స్కీమ్ లకు సంబంధించి..నేను ఇప్పటి వరకూ 350 ద్విచక్ర వాహనాలను స్కీమ్ ద్వారా ఇచ్చాను. 350 వాహనాలకు సంబంధించి.. ఆఫ్ లైన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా ప్రతాప్ కొంత డబ్బు నాకు ఇచ్చాడు. మిగతా డబ్బులు ప్రతి నెల వస్తాయని అనుకుని.. నేను కూడా ఏమీ అనలేదు. డబ్బుల గురించి కూడా ప్రతాప్ ను చాలాసార్లు అడిగాను. డబ్బులు ఎక్కడా పోవు అని సమాధానం ఇచ్చేవాడు. డబ్బులు వసూలు చేసి, ఇస్తానని చెప్పాడు. ఐదు, ఆరేళ్లుగా నా వద్ద నమ్మకంగా పని చేస్తున్నందున అతడిని పూర్తిగా నమ్మాను. నేను నమ్మినందుకు తగిన గుణపాఠం చెప్పాడు. నాకు జీవితం అనేది లేకుండా చేశాడు. ఈ లోటును ముందే గుర్తించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. స్కీమ్ లు పూర్తయ్యే సమయం వచ్చింది. అందరికీ సెటిల్ మెంట్ చేసే సమయం అది. మళ్లీ డబ్బుల గురించి ప్రతాప్ ను అడిగాను.  డబ్బులు వస్తాయి.. చివరిదాక మనకు టెన్షన్ ఉండదు మనకు ఆడికాడికి అవుతాయని  చెప్పాడు. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను. తర్వాత స్కీమ్ దగ్గరకు వచ్చింది. రెండు నెలల సమయం ఉంది. మరోసారి కూడా ప్రతాప్ ను డబ్బుల గురించి అడిగాను. అప్పుడు కొన్ని రోజులు సమయం తీసుకుని.. ఒక స్కీమ్ 62 లక్షలు ఇచ్చేది ఉందని చెప్పాడు.మిగతా స్కీమ్ ల గురించి చెప్పలేదు అంటూ సబ్బాని నరేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.