సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఓట్లు అంత అంత మాత్రం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఓట్లు అంత అంత మాత్రం

ముద్ర ప్రతినిధి, ఖమ్మం/పాలేరు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు అసెoబ్లీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల సరళి పరిశీలిస్తే  ఆయన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఆరు రౌండ్లు పూర్తి అయ్యే సరికి  కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 34,311, బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి 20,954,  సిపిఎం అభ్యర్థి తమ్మినేని 1035 ఓట్లు సాధించారు. తమ్మినేని సొంత ఊరు ఇదే నియోజకవర్గంలోని  ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామం. సాంకేతిక కారణాల వల్ల  ఈ ఎన్నికల్లో ఆయన ఓటు వేయలేకపోయిన విషయం తెలిసిందే.