కొండగట్టు అంజన్న హుండి లెక్కింపు

కొండగట్టు అంజన్న హుండి లెక్కింపు

ముద్ర, మల్యాల :మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ముత్యంపేట (కొండగట్టు) శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీల కానుకలను శుక్రవారం లెక్కించారు. శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారిచే అంజన్నకు 36 రోజులకు గాను 12 హుండీ లు విప్పగా రూ" 88 లక్షల 03 వెయ్యిల 608 ల నగదు తో పాటు మిశ్రమ బంగారం 41 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 510 గ్రాములు, విదేశీ కరెన్సీ 27 నోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏ.చంద్రశేఖర్ తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది, పర్యవేక్షించారు. ఈ లెక్కింపులో వరంగల్ ఉప కమీషనర్ దేవాదాయశాఖ పరిశీలకులు ఎన్. కవిత, ఏ.చంద్రశేఖర్, ఎ.ఈ.ఓ. వై. అంజయ్య, సూపరింటెండెంట్స్ శ్రీనివాస శర్మ, సునీల్ కుమార్, చంద్రశేఖర్, ఏ.ఎస్.ఐ.లు చిలుక శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.