ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ తోనే సాధ్యం

ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ తోనే సాధ్యం

ముద్ర.వనపర్తి: ఉద్యోగాల కల్పన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్య తూడి మేఘా రెడ్డి అన్నారు. స్టాఫ్ నర్స్ ఆఫీసర్లు గా ఉద్యోగాలు పొంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకునేందుకు హైదరాబాద్ వెళుతున్న బస్సులను ఆయన జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ పరిధిలో 99 మంది స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు పొందారని గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాల కల్పన మొదలైందని అందుకు నిదర్శనం ఈ స్టాఫ్ నర్స్ ల నియామకమని అన్నారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సాయినాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కౌన్సిలర్లు జయసుధ మధు, బ్రహ్మం, లక్ష్మీ రవి యాదవ్, నాయకులు కార్యకర్తలు అధికారులు స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.