కాంగ్రెస్ వస్తే.. మండలానికో ఎమ్మెల్యే..

కాంగ్రెస్ వస్తే..  మండలానికో ఎమ్మెల్యే..

సత్తుపల్లి, ఖమ్మం జిల్లా..

 కడుపు చూసే మనిషి కేసీఆర్..

 ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి, ఎమ్మెల్యే సండ్ర...

 సత్తుపల్లి, ముద్ర:పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మండలానికో ఎమ్మెల్యే ఉంటాడని, పని కావాలంటే కాళ్లు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుందని శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో బుధవారం రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉండి సామాన్య కార్యకర్తగానే క్రమశిక్షణతో నడుచుకుంటున్నానన్నారు. పదవులు అడ్డుపెట్టుకొని వేధింపులకు పాల్పడలేదని, తనను కలవడానికి అడ్డుగోడలు లేవని,ఏనాడు ఎమ్మెల్యేగా దర్పం చూపించలేదన్నారు.

ఈసారి కూడా గెలిపించి సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసార రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపు చూసే మనిషి అన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర ప్రధాయని అయిన సీతారామ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. తద్వారా మూడు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.