అభివృద్ధి కోసం కృషి చేసే వారినే గెలిపించాలి

అభివృద్ధి కోసం కృషి చేసే వారినే గెలిపించాలి
  • మీ బిడ్డకు మరోసారి పట్టం కట్టండి..
  • సొంత మండలంలో భారీ మెజారిటీ అందించండి.. 
  • జెడ్పీటీసీ ప్రమొదిని

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:అభివృద్ధి కోసం కృషి చేసే వారినే గెలిపించాలి,  మీ బిడ్డ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మరోసారి పట్టం కట్టండి అని జెడ్పీటీసీ సభ్యురాలు ప్రమొదిని కోరారు. బుధ వారం బషీరాబాద్ మండల నవల్గా గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటికి తిరిగి బీఅర్ఎస్ మేనిఫెస్టో ను ఆమె గ్రామస్థులకు వివరించారు. సీఎం కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని వాటి ద్వారా ఎంతో మంది పేదల లబ్ధి పొందుతున్నారని ఆమె తెలిపారు. సొంత మండలంలో పైలెట్ కు భారీ మెజారిటీ అందించండన్నారు. ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నాం అని మరోసారి గేలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని ఆమె అన్నారు.