కాంగ్రెస్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలను అన్ని మాయం అవుతాయి

కాంగ్రెస్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలను అన్ని మాయం అవుతాయి
  • ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: కడప జిల్లా తాండూర్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేయాలని రోహిత్ రెడ్డి అన్నారు.ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి   యాలాల మండలం పెర్కంపల్లి, పెర్కంపల్లి తండా, ఎన్కేపల్లి, మల్ రెడ్డి పల్లి, అగ్గనూర్, లక్ష్మి నారయణపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ వి ఫేక్ హామీలు, ఝూట మాటలు..కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే పథకాలు అన్ని మాయమవుతాయని అన్నారు.పండుగ పూట కూడా కర్ణాటకలో కరెంట్ లేదు.. ఎన్నడూ లేనివిధంగా 2 ఎండ్లలో రూ.1670 కోట్లతో తాండూరులో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దొంగలందరూ ఏకమై రాజకీయ కుట్ర చేస్తున్నారు, ప్రజలందరూ గమనించాలి. బయటోడు కావాల్నా, ప్రజల్లో ఉండే మీ బిడ్డ కావాల్నా అని అన్నారు.