బిఆర్ఎస్ పార్టీలో చేరిన టీపీపీసీ మహిళ రాష్ట కార్యదర్శి కటమోని తిరుపతమ్మ

బిఆర్ఎస్ పార్టీలో చేరిన టీపీపీసీ మహిళ రాష్ట కార్యదర్శి కటమోని తిరుపతమ్మ

ముద్ర. వీపనగండ్ల:-కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డ  వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామానికి చెందిన టీపీపీసీ మహిళ రాష్ట కార్యదర్శి కటమోని తిరుపతమ్మ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణయ్య గౌడ్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ల సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీలో చేరిన కటమోని తిరుపతమ్మ కృష్ణయ్య గౌడ్ లకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పార్టీలో  సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుపతమ్మ కు సూచించారు.కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య,నర్సాయిపల్లి సర్పంచ్ సత్యం యాదవ్ ఉన్నారు.