నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష– రెండు వేల రూపాయల జరిమానా

నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష– రెండు వేల రూపాయల జరిమానా

ముద్ర.వీపనగండ్ల:- వరకట్న వేధింపులతో భర్త పెట్టే వేధింపులను భరించలేక భార్య నిప్పుంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నాలుగు సంవత్సరాల తర్వాత  భర్తకు  6 సంవత్సరాల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ వనపర్తి సివిల్ కోర్టు జడ్జి రజిని తీర్పునిచ్చారని వీపనగండ్ల ఎస్ఐ రవి ప్రకాష్ తెలిపారు. ఎస్ఐ కథన ప్రకారం మండల కేంద్రానికి చెందిన దయపు శివ  మంతటి గ్రామానికి చెందిన శివమ్మ కులాంతర వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిందని, తాగుడకు చెడు అలవాట్లకు బానిసైన శివ, భార్య శివమ్మ ను వరకట్నం తీసుకురావాలంటూ వేధించసాగేవాడని తెలిపారు. భర్త శివ పెట్టే వేధింపులను భరించలేక 2019 సంవత్సరంలో శివమ్మ తన ఇంటిలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. విచారణ అనంతరం నిందితుడు శివ కు కోర్టు  ఐపీసీ సెక్షన్ 229/2021 ప్రకారం శిక్ష విధించిందని ఎస్సై రవి ప్రకాష్, కోర్టు కానిస్టేబుల్ రాజేందర్ తెలిపారు.