ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని స్కాలర్స్ హై స్కూల్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన భార్య బీరం విజయమ్మతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలో విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొవలని సూచించారు.