సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి

సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి

ముద్ర.వీపనగండ్ల:- మండల కేంద్రమైన వీపనగండ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు,. గ్రామంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన సరియైన వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించాలని సిపిఎం నాయకులు మాజీ సర్పంచ్ వెంకటయ్య, మాజీ వార్డు సభ్యులు ఆశన్న, నాయకులు నక్క శీను కోరారు.

గోవర్ధనగిరి వద్ద ఆ సంపూర్తిగా నిర్మించి వదిలేసిన బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని,అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన బిటి డబల్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని,కొల్లాపూర్ డిపో నుండి కొండూరు, తూముకుంట, వీపనగండ్ల, గోపాల్ దిన్నె,గోవర్ధనగిరి గ్రామాల మీదుగా పెబ్బేర్ వనపర్తి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. ఆసుపత్రికి అత్యవసర సమయాలలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాలలో ఆసుపత్రిలో సరియైన వైద్య సౌకర్యం అందక, పెద్ద ఆస్పత్రికి వెళ్ళటానికి అంబులెన్స్ సౌకర్యం లేక రోగులు మృతి చెందిన సంఘటన కోకకల్లులుగా ఉన్నాయని,వెంటనే అంబులెన్స్ సౌకర్యం కల్పించి, రోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఎస్సీ గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టాలని, బేక్కెం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ వినతి పత్రంలో మంత్రి జూపల్లి ని కోరారు.