సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ముద్ర,తెలంగాణ:- సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇటీవల సిరిసిల్లకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నారని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారని తెలిపారు. అయితే దీనిపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇది ఏం భాష రేవంత్.. నువ్వు సిఎంవా.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.