పే స్కేల్​చెల్లింపు కోసం పీఆర్సీ నియామకం 

పే స్కేల్​చెల్లింపు కోసం పీఆర్సీ నియామకం 
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్.శివశంకర్(రిటైర్డ్ ఐఏఎస్)ను, సభ్యుడిగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఏఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ 6 నెల్లలోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. కాగా 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.