చంద్రుడిని చేరిన చైనా వ్యోమనౌక చాంగే -6

చంద్రుడిని చేరిన చైనా వ్యోమనౌక చాంగే -6

China Change-6 moon landing mission: చైనా దేశం ప్రయోగించిన చాంగే -6 ల్యూనార్ ప్రోబ్ విజయవంతంగా చందురడి దక్షిణ ధ్రువంపై దిగినట్టుగా ఆ దేశ నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ల్యాండర్, అసెండర్ తో కూడిన ఈ ప్రోబ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా దిగడంతో పాటు, అక్కడ అరుదైన నమూనాలను సేకరించినట్టు ప్రకటించింది. కొయెచావ్ -2 రిలే ఉపగ్రహం ద్వారా ల్యాండ్ దిగినట్టు స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. రెండు రోజుల పాటు  రెండు పద్ధతుల్లో ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను సేకరిస్తుందని, అలాగే అక్కడి కక్కడే మట్టి నమూనాల శాస్త్రీయ విశ్లేషణ జరుగుతుందని వివరించింది. ఈ విశ్లేషణ ద్వారా చంద్రుడి చరిత్రను తెలుసుకోడానికి వీలవుతుందని పేర్కొంది. మే 3న పంపించిన చాంగే -6 వివిధ దశలను దాటుకుంటూ చంద్రుడిని చేరింది.