ఎనిమిదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

ఎనిమిదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

ముద్ర,సిద్ధిపేట:- ఇటీవల దేశంలో గుండెపోటు మరణాల సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు పెద్ద వయస్సు వారికే గుండెపోటు వస్తుందని అనేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై  ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే...

సిద్దిపేట అర్బన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం తడ్కపల్లిలో అంబటి మహేష్ కూతురు లాక్షణ్య (13) గుండెపోటుతు కన్నుమూసింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో లాక్షణ్య 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ట్యాబ్లెట్ వేశారు. ఉదయం టిఫిన్ చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. బాత్ రూం కు వెళ్లిన లాక్షణ్య ఎంతకీ బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో పడి ఉంది ఆ చిన్నారి. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించారు. లాక్షణ్యకు తీవ్రమైన గుండెపోటు రావడం వల్లనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.