సిద్దిపేట నీలకంఠ సమాజం సేవలు అభినందనీయం

సిద్దిపేట నీలకంఠ సమాజం సేవలు అభినందనీయం

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్ధిపేట : ముద్ర ప్రతినిధి: సభ్యులందరి సమిష్టి కృషితోనే సిద్ధిపేట నీలకంఠ సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులలో పోటీ తత్వం పెంచి ఉన్నత చదువులు చదివేందుకు వారికి నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో బహుమతులు అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు.
సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంటేశ్వర ఆలయ 32 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళవారం రోజున గణపతి పూజతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు గురువారం రోజు గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవముతో ముగిశాయి.ఈ కళ్యాణ మహోత్సవంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.అలాగే  ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నీలకంఠ సమాజ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికలు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.
విద్యార్థులు అందరూ బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు.ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నగదు ప్రోత్సాహం అందిస్తున్న కడవెరుగు నర్సింలు, శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్, మధుసూదన్లను ఎంపి అభినందించారు.
కళ్యాణం అనంతరం ఆలయంలో ప్రజలందరికీ అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.