హనుమాన్ దేవాలయంలో సుందరాకాండ హవనం

హనుమాన్ దేవాలయంలో సుందరాకాండ హవనం

సిద్దిపేట, ముద్ర, ప్రతినిధి: సిద్దిపేటలోని శ్రీ రామరాజు రావిచెట్టు దేవాలయంలో సుందరకాండ హవనం నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి నుంచి హనుమత్ జయంతి వరకు సుందరకాండ హవనము ప్రతిరోజు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు.ఆలయం వద్ద హనుమాన్ దీక్ష స్వాములకు నిత్యము అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని వివరించారు. రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారి మండపంలో హవన కార్యక్రమము హారతి జరుగుతాయని భక్తులు హాజరుకావాలని కోరారు.