మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎంపి భూమి పూజ 

మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎంపి భూమి పూజ 

ముద్ర:దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో నూతన మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆదివారము ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. భవన నిర్మాణంలో తన వంతు కృషి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్లకొండ శ్రీధర్, నాయకులు చింత రాజ్ కుమార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి,స్థానిక బిఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు